
- ప్రకటించిన మహీంద్రా
న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ ఫ్లోర్ వర్కర్లు సహా దాదాపు 23 వేల మంది ఉద్యోగుల కోసం వన్-టైమ్ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్)ను ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈఓ, ఎండీ అనిష్ షా తెలిపారు.
వీటి విలువ రూ. 400-500 కోట్ల పరిధిలో ఉంటుందని ఆయన అన్నారు. మహీంద్రా మూడు కీలక అనుబంధ సంస్థలు - మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో, వ్యవసాయ రంగాలు), మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రకటించారు. షేర్లు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల (ఆర్ఎస్యూ) రూపంలో మంజూరవుతాయి.
తమ మార్కెట్ క్యాప్ గత ఐదు సంవత్సరాల్లో 12 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రూప్లో కనీసం 12 నెలల సర్వీసు గల పర్మనెంట్ఉద్యోగులు ఈసాప్లను పొందేందుకు అర్హులు అవుతారు. మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభంలో 24 శాతం పెరుగుదలతో రూ. 4,083 కోట్లకు చేరుకుంది.