అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన లక్ష్యాలు

అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన లక్ష్యాలు

ఉష్ణమండల దేశాలన్నీ కలిపి భారీ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించారు. భూమధ్య రేఖకు ఇరువైపుల ఉన్న అనేక ఉష్ణమండల దేశాలను సూర్య పుత్రులుగా అభివర్ణిస్తూ వారందరూ ఈ కూటమిలో చేరాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని 2015 నవంబర్​ 30న ప్రారంభించారు. ఈ కూటమి ప్రారంభోత్సవంలో అప్పటి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్​ హోలాండ్​, అప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్​ బాన్​ కి మూన్​ పాల్గొన్నారు. 

ప్రధాన లక్ష్యాలు 

  •     2030 నాటికి 1000 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం
  •     2030 నాటికి 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం
  •     2030 నాటికి 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్​ టన్నుల ఉద్గారాలను తగ్గించడం
  •     దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్​లో ఉంది. 
  •     ఈ కూటమిలోకి 105వ దేశంగా 2022 జనవరిలో నేపాల్​ చేరింది.
  •    అంతర్జాతీయ సోలార్​ అలయన్స్​ మొదటి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో 2018, మార్చి 11న జరిగింది. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు సౌరశక్తి, సోలార్​ మినీ గ్రిడ్లు, రూఫ్​టాప్​ ఇన్​స్టలేషన్లు, ఇ–మొబిలిటీ రంగాల్లో తమ ప్రాధాన్యతలపై ఐఎస్ఏ సంప్రదింపులో 36 దేశాలు పాల్గొన్నాయి. మొదటి దశ నిధులు సేకరించడానికి 100 ప్రాధాన్యతా ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి.