ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం : ప్రపూల్ రాంరెడ్డి

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం : ప్రపూల్ రాంరెడ్డి

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తోందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షుడు ప్రపూల్ రాంరెడ్డి అన్నారు. ఉద్యమకారుల జేఏసీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను అణిచివేసిందని, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్​ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. సదస్సులో టీడీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు సుద్దమళ్ల వెంకటస్వామి, జేఏసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, మోహన్ బైరాగి తదితరులు పాల్గొన్నారు.