హైదరాబాద్ యూనివర్సిటీలో లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు.. అనుభవం ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

హైదరాబాద్ యూనివర్సిటీలో  లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు.. అనుభవం ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్ (యూఓహెచ్) ప్రాజెక్ట్ అసోసియేట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 17. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో లైఫ్ సైన్స్ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆల్గేలో మాలిక్యులర్ బయాలజీ, ఫిజియాలజీలో పరిశోధన అనుభవం ఉండాలి. 

లైబ్రరీ అసిస్టెంట్ : లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయాలజీ విభాగంలో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. బయాలజీ ల్యాబ్​లో కనీసం ఏడాది పని అనుభవం తప్పనిసరి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 17. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు uohyd.ac.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.