హైదరాబాద్​లో మైసన్ సియా షోరూమ్​

హైదరాబాద్​లో మైసన్ సియా షోరూమ్​

హైదరాబాద్, వెలుగు :  హోం డెకర్​బ్రాండ్​ మైసన్ సియా, హైదరాబాద్​లో  తన సరికొత్త స్టోర్​ను ప్రారంభించింది. నగరంలోని బంజారాహిల్స్​లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ ప్రపంచంలోని అత్యుత్తమ గృహాలంకరణలకు సంబంధించిన అద్భుతమైన వస్తువులను, కళాఖండాలను ప్రదర్శిస్తుందని సంస్థ ప్రకటించింది.  

ప్రతి ఒక దానిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రముఖ లగ్జరీ అటెలియర్ల నుండి ఎంపిక చేశామని తెలిపింది. వినియోగదారులు ఆధునిక యూరోపియన్ వీధిలో ఉన్న అనుభూతిని పొందేటట్టుగా ఈ స్టోర్​ను తీర్చిదిద్దామని పేర్కొంది.  ప్రత్యేకమైన కళాఖండాలు, ప్రత్యేకమైన సెంటర్ పీసులు, విలక్షణమైన శిల్పాల వంటివి ఇక్కడ లభిస్తాయి. లగ్జరీ టేబుల్​వేర్​, లిమిటెడ్​ ఎడిషన్​ శిల్పాలను కూడా కొనుక్కోవచ్చని, మైసన్ సియా ఫౌండర్​, సీఈఓ వ్రతిక అగర్వాల్ అన్నారు.