
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ లోని లక్కారం స్టేజి దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని వెనక నుంచి మరో లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు స్పాట్ లోనే మృతి చెందారు. లారీలో ఒకదాంట్లో ఉల్లిగడ్డ లోడు... మరో దాంట్లో బీర్లతో కూడిన లోడ్ ఉండటంతో సరుకంతా నేలపాలైంది.
బీర్లు.. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు జనం ప్రయత్నించడంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు యాక్సిడెంట్ పై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు. ట్రాఫిక్ జాంను నెమ్మదిగా వదులుతున్నారు.