ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి 11గంటలకు చోటుచేసుకుంది. ముంబై- నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి మహామార్గ్)పై బంక్ దగ్గరకి వస్తున్న ఓ కారు రాంగ్‌ డైరెక్షన్‌లో రావడంతో మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు గాయపడ్డారు. కారుని ఢీకొట్టిన మరో కారు బారుకేడ్లను ఢీకొట్టుకొని పల్టీలుకొట్టి హైవేపై  నుంచి కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును రోడ్డుపై నుంచి తొలగించారు. హైవేపై ట్రాపిక్ ను క్లియర్ చేశారు.