
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వంద స్పీడ్ లో వెళుతున్న రెండు పెద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు నగరంలోని వనస్థలిపురం వాసిగా రెడ్డప్ప రెడ్డిగా గుర్తించారు.