డ్రైనేజీలోకి పెట్రోల్ లీక్.. పెట్రోల్ బంక్ లో చెలరేగిన మంటలు

డ్రైనేజీలోకి పెట్రోల్ లీక్.. పెట్రోల్ బంక్ లో చెలరేగిన మంటలు

హన్మకొండలో ఓ పెట్రోల్ బంకులో  పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలోని బాలసముద్రంలో HP పెట్రోల్ బంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్  పరిసరాలతో సహా పక్కన ఉన్న హోటల్ కు కూడా మంటల వ్యాపించాయి. హోటల్ లో వస్తువులు మంటల్లో కాలిపోయాయి. దీంతో హోటల్, బంకు సిబ్బంది, వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనస్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు.

పెట్రోల్ బంక్ జనవాసాల మధ్య ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.  ఫైర్ సిబ్బంది మంటల సకాలంలో అదుపులో తేవడంతో పెను ప్రమాదం తప్పింది.  అయితే డ్రైనేజీలోకి లీకైన పెట్రోల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ట్యాంకర్లు క్లీన్ చేసే క్రమంలో పెట్రోల్ లీక్ అయినట్ల  గుర్తించారు.