
మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటన స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహలు, పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల దళాలు. చత్తీస్‌గఢ్ బోర్డర్ వండోలి గ్రామంలోని ఓ క్యాంప్ లో దాదాపు 15 మంది నక్సల్స్ ఉన్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిప్యూటీ ఎస్పీ Ops నేతృత్వంలో C60 కమాండోలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది నక్సల్స్ మృతిచెందారు.
చనిపోయిన మావోయిస్టుల్లో తిప్పగడ్డ దళం ఇంచార్జి డివిసిఎం లక్ష్మణ్ అత్రం అలియాస్ విశాల్ అత్రం ఒకరిగా గుర్తించారు. మావోయిస్టుల గుర్తింపు, ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. సీ60కి చెందిన ఒక పీఎస్‌ఐ, ఒక జవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని నాగ్‌పూర్‌కు తరలించారు. క్యాంప్ నుంచి మూడు AK47, రెండు INSAS, ఒక కార్బైన్, SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు కమాండోలు స్వాధీనం చేసుకున్నారు.