అయోధ్యలో ఉగ్రదాడికి కుట్ర: నలుగురు జైషే టెర్రరిస్టుల అరెస్ట్

V6 Velugu Posted on Aug 14, 2021

శ్రీనగర్: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దాడులకు జైషే మహ్మద్ టెర్రరిస్టులు పన్నిన కుట్రను జమ్ము కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. శనివారం నలుగురు జైషే టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. డ్రోన్ల ద్వారా తుపాకులు, పేలుడు పదార్థాలు పంపి కశ్మీర్‌‌లో ఇతర జైషే టెర్రిస్టులకు సప్లై చేయడం ద్వారా దాడికి పాల్పడాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. అలాగే జమ్ములో ఐఈడీ బాంబులు పెట్టి పేలుళ్లకు పాల్పడాలని కుట్రపన్నారన్నారు. బీహార్‌‌లోని పానిపట్‌లో ఉన్న ఆయిల్ రిఫైనరీ, ఆయోధ్య రామ జన్మభూమిపైనా దాడులు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తేలిందని చెప్పారు. టెర్రిస్టులను అరెస్టు చేసిన సమయంలో వాళ్ల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు సీజ్ చేశామన్నారు. జమ్ములో అటాక్ కోసం మోటార్ సైకిల్‌కు ఐఈడీ బాంబ్‌ ఫిక్స్ చేసి ఉంచారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.

జమ్ము కశ్మీర్‌‌లోని పుల్వామాలో మొదట జైషే టెర్రరిస్ట్ ముంతజిర్ మంజూర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఒక పిస్టల్‌, ఒక మ్యాగజైన్, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రెండు చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లు రికవరీ చేసుకున్నారు. ఆయుధాల రవాణాకు వాడుతున్న ఒక ట్రక్‌ను కూడా సీజ్‌ చేశారు. కస్టడీలో మంతజిర్‌‌ను ఇంటరాగేట్ చేయడంతో మరో ముగ్గురు జైషే టెర్రరిస్టులు స్కెచ్‌లు వేస్తున్నట్లు తెలిసింది. వాళ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా పాకిస్థాన్‌లో ఉన్న జైషే కమాండర్ మునాజిర్ అలియాస్‌ షాహిద్ డైరక్షన్‌లో పని చేస్తున్నట్లు ఒక టెర్రరిస్ట్ చెప్పాడు. పంజాబ్‌ నుంచి బాంబులు వస్తాయని, డ్రోన్‌ ద్వారా అటాక్ చేయాలని ఆదేశాలు వచ్చాయని తెలిపాడు. అలాగే పానిపట్ ఆయిల్ రిఫైనరీ, ఆయోధ్య రామ జన్మభూమిలో రెక్కీ చేసి దాడులు చేయాలని కమాండ్ వచ్చినట్లు పోలీసులు ఇంటరాగేషన్‌లో బయటపెట్టాడు. అరెస్టయిన టెర్రిస్టుల్లో టౌసీఫ్​ అహ్మద్‌ షా, జహంగీర్ అహ్మద్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఉగ్ర దాడులు జరిగే చాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయడంతో అప్రమత్తమై టెర్రరిస్టుల కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Tagged Ayodhya, Independence Day, kashmir, Jammu, terror attack, Jaish terrorists

Latest Videos

Subscribe Now

More News