కూకట్పల్లి వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

కూకట్పల్లి వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ  వెళ్లే దారిలో మూసాపేట్ బ్రిడ్జ్ దగ్గర ఒక భారీ వాహనం బోల్తా పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నత్తనడకన ట్రాఫిక్ ముందుకు సాగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆఫీస్ లకు, ఇతరత్రా పనులకు వెళ్లేవాళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోల్తా పడిన వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.