Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు

Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు

తేయాకు రుచి తెలియనిదెవరికి! అది తాగితే ఉత్తేజాన్నిస్తుంది. కొన్నాళ్లు తాగితే బానిసల్ని చేసుకుంటుంది. తేనీటి అభిరుచి ప్రపంచమంతా ఉంది. ఈ ప్రపంచమంతా పరిచయమున్న పేరు డార్జిలింగ్. ఎత్తయిన శిఖరాలతో ఉండే హిమాలయాలున్న డార్జిలింగ్ కు మంచి పేరు. తెచ్చింది మాత్రం ఈ కాఫీ తోటలే.. సముద్ర మట్టానికి 2,200 అడుగుల ఎత్తులో ఉన్న డార్జిలింగ్ పర్వతాలపై కాఫీ ఎస్టేట్లు కూడా పర్యాటకుల్ని ఆకట్టుకునేవే. దేశంలో ఎన్నో కాఫీ తోటలున్నాయి. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ 87 కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. డార్జిలింగ్ పట్టణానికి 33 కిలోమీటర్ల దూరంలో బ్రిటిష్ కాలం నాటి కాఫీ తోటలతోపాటు టీ ఫ్యాక్టరీలున్నాయి. వాటిలో ఒకటైన 'సిల్వర్ టిప్స్ ఇంపీరియల్' అనే ఫ్యాక్టరీలో తయారయ్యే టీకి ప్రపంచవ్యాప్తంగా భలే గిరాకీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే 'మకైబరీ' బ్రాండ్ తేయాకు అంటే మక్కువ ఎక్కువ. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఇది ఎగుమతి అవుతోంది. దీని డిమాండ్ గురించి ధరే చెబుతుంది. మకైబరి బ్రాండ్ కిలో తేయాకు పొడి ధర అమెరికాలో 15 వందల డాలర్లకుపైగా ఉంది. నాణ్యత, రుచిలో దీనికి అక్కడ సాటిలేదట. లగ్జరీకి ఈ తేయాకు ఒక సింబల్! అందుకే డార్జిలింగ్ ని తేనీటి ప్రియులు 'శాంపెయిన్ ఆఫ్ టీస్' అని పిలుస్తున్నారు.