
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ రూపొందిస్తున్న చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు, టీజర్ విడుదల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు సరికొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు.
కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌లో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విజయ్ స్మోక్ చేస్తుంటే, సమంత కాఫీ తాగుతున్నట్లుగా ఉంది. ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతున్నట్టు స్టిల్ రిలీజ్ చేసి ట్రైలర్‌పై అంచనాలు పెంచారు మేకర్స్. 2.41 నిమిషాల డ్యురేషన్‌తో ట్రైలర్ ఉంటుందని తెలియజేశారు.
అలాగే హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలకు రికార్డ్ వ్యూస్ వస్తుండటంతో ఈ నెల 15న మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.