దీపావళికి వేటగాడు

దీపావళికి వేటగాడు

ఇటీవల ‘లాల్‌‌ సలామ్‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రజినీకాంత్... ప్రస్తుతం ‘వెట్టైయన్‌‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం. టీజే జ్ఞానవేల్‌‌ దీనికి దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌‌ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్‌‌ డేట్‌‌కి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్‌‌ ప్లాన్‌‌ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఎనభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది. మరో మూడు వారాల పాటు రజినీకాంత్‌‌ పాత్రకు సంబంధించిన సీన్స్ తెరకెక్కించాల్సి ఉందని సమాచారం. మార్చి నెలలో షూటింగ్‌‌ పూర్తి కానుంది. రజినీకాంత్ కెరీర్‌‌‌‌లో ఇది 70వ చిత్రం. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.