
సమంత లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఫ్యామిలీ మేన్ సిరీస్‌తో మెప్పించిన రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. హాలీవుడ్‌లో వచ్చిన సిటాడెల్’ సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 01.08 అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హనీ, బన్నీ ఎమోజీస్‌ను షేర్ చేశారు.
అయితే ఆ రోజున టీజర్, ట్రైలర్ రాబోతోందా, లేక రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారా అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. ఆగస్టు 1న రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ మాత్రం రానుంది. కేకే మీనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ‘రక్త్ బ్రహ్మాండ’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సమంత రెడీ అవుతోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఇది సెట్స్‌కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.