మిగిలిపోయిన కలపతో ఫర్నిచర్ చేస్తే....

మిగిలిపోయిన కలపతో ఫర్నిచర్ చేస్తే....

ఫర్నిచర్ తయారుచేయడం కోసం ఏటా బోలెడన్ని చెట్లు నరికేస్తుంటారు. అయితే అందులో సగం కలప మాత్రమే ఫర్నిచర్‌‌‌‌కు పనికొస్తుంది. మిగతా సగం వృథాగా మిగిలి పోవాల్సిందే. ‘అలాకాకుండా మిగిలిపోయిన కలపతో కూడా ఫర్నిచర్ చేస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది ఆకృతి కుమార్‌‌‌‌కు. కలప వేస్ట్‌‌తో ఫర్నిచర్ చేస్తే బోలెడన్ని చెట్లను కాపాడొచ్చని అనుకుంది. ‘డిఫర్నిచర్’  అనే కంపెనీ పెట్టి కలప వేస్ట్‌‌తో అందమైన ఫర్నిచర్ తయారుచేస్తోంది. 

ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల ఆకృతి కుమార్‌‌కు ‌‌ఫర్నిచర్ ఆర్ట్‌‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ కోర్స్‌‌ కోసం న్యూయార్క్‌‌లోని పార్సన్స్‌‌ స్కూల్‌‌ ఆఫ్‌‌ డిజైన్‌‌లో చేరి గ్రాడ్యుయేషన్‌‌ పూర్తి చేసింది. అయితే, చదువుతున్న టైంలో చాలారకాల ఎన్జీవోలు ‘వుడ్‌‌ వేస్టేజ్‌‌, చెట్ల నరికివేత’ ఆపాలని చేస్తున్న సమ్మెలను చూసింది. అవి చూశాక చెట్లు కొట్టివేయడాన్ని కొంతవరకైనా ఆపాలనే  ఆలోచన వచ్చి, సొంతంగా  ‘డిఫర్నిచర్‌‌’ కంపెనీ పెట్టింది. డిఫర్నిచర్‌‌ అంటే ‘డిఫరెంట్‌‌ ఫ్రమ్‌‌ ఫర్నిచర్‌‌’‌‌ అని అర్థం. తను తయారుచేసిన వస్తువులు కొత్తగా ఉంటాయని ఆ పేరు పెట్టింది ఆకృతి.

డిఫరెంట్‌‌గా ఉండేలా

కలప వేస్ట్​తో ఫైర్‌‌‌‌, వాటర్ రెసిస్టెంట్‌‌గా. అనుకున్నట్టుగానే ముందు ఒక టేబుల్‌‌ని తయారుచేసింది. దాని డిజైన్‌‌, అది తయారుచేసిన పద్ధతి అందరికీ నచ్చడంతో బిజినెస్‌‌ మొదలుపెట్టింది. తను డిజైన్‌‌ చేసిన ఫర్నిచర్‌‌‌‌ చెక్కడానికి ఐదుగుర్ని పనిలో పెట్టుకుంది. డిఫర్నిచర్‌‌లో కుర్చీలు, టేబుల్స్‌‌, సోఫా, అవుట్‌‌డోర్‌‌‌‌ ఫర్నిచర్‌‌‌‌, షాండ్లియర్స్‌‌ లాంటివి తయారుచేస్తుంది. ఇవి తయారు చేయడానికి ఉపయోగపడే కలప వేస్టేజ్‌‌ను ఫర్నిచర్‌‌‌‌ వర్క్​షాప్‌‌ల నుంచి సేకరిస్తుంది. ఇవి తయారుచేయడానికి ‘షౌ సుగి బాన్‌‌’అనే జపాన్‌‌ టెక్నిక్‌‌ని వాడుతుంది. ఈ టెక్నిక్‌‌లో ముందు చెక్క పైభాగాన్ని కాలుస్తారు. తరువాత పాలిష్‌‌ చేస్తారు. దీనివల్ల ఫర్నిచర్‌‌‌‌కు చెదలు పట్టకుండా ఉంటుంది. డిఫర్నిచర్‌‌ పెట్టినందుకు ఫోర్బ్స్‌‌లోకి కూడా ఎక్కింది ఆకృతి.

‘నేను తయారుచేసిన వాటిని ఫర్నిచర్‌‌‌‌గా కాకుండా ఒక ఆర్ట్‌‌లా చూస్తా. వుడ్‌‌ వేస్టేజ్‌‌ తగ్గించాలని అందరికీ చెప్తుంటా. నేను ఒక వస్తువు అమ్మితే దాని గుర్తుగా ఒక చెట్టు నాటుతా. అంటే ఒక వస్తువు తయారైందంటే ఒక చెట్టును కొట్టేశారని కదా అర్థం. అందుకే నేను ఈ పని చేస్తా. ప్రతీ ఒక్కరు చెట్లు నాటాలి. పర్యావరణాన్ని రక్షించాలి’ అని అంటోంది ఆకృతి.