హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్లో బుధవారం మరో పది మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో పెద్దపల్లిలో నలుగురు, కరీంనగర్లో ఒకరు, జగిత్యాలలో ముగ్గురు, నిజామాబాద్లో ఇద్దరు ఉన్నారు. కాగా, బుధవారం ఫస్టియర్మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 4,26,197 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 4,10,992 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు.
