మాలల సింహగర్జన ను విజయవంతం చేయాలి : నీరడి రవి

మాలల సింహగర్జన ను విజయవంతం చేయాలి : నీరడి రవి

బోధన్ వెలుగు : మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని  మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం బోధన్​ పట్టణంలోని శక్కర్ నగర్​ హరిజన సుధార్​ సమితి సంఘ భవనంలో చలో హైదరాబాద్​ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ మాల మహానాడు ఉద్యమించక తప్పదన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు బోధన్ టౌన్ అధ్యక్షుడు రేకం దాసు తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్, వెలుగు: డిసెంబర్​ 1న  హైదరాబాద్​పోలీస్ పరేడ్​గౌండ్​లో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జన వాల్​ పోస్టర్లను జిల్లా మాలల సింహ గర్జన ఇన్చార్జి బంటు భూమేశ్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్​1 న నిర్వహిస్తున్న మాలల సింహ గర్జన సభకు జిల్లా నలుమూలల నుంచి  మాలలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.