–ముంబై: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఫ్యాషన్ యాక్సెసరీల తయారీ సంస్థ టైటాన్‌తో పాటు మరో నాలుగు ఆభరణాల సంస్థలు గ్లోబల్ టాప్-–100 లగ్జరీ బ్రాండ్ల లిస్టులో చేరాయి. మలబార్ గోల్డ్ నంబర్ వన్ ప్లేసులో ఉంది. భారతీయ అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్‌గా 19వ ర్యాంక్‌ను దక్కించుకుంది. టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కంపెనీ 24వ స్థానాన్ని దక్కించుకుంది.
డెలాయిట్ గ్లోబల్ లగ్జరీ గూడ్స్ లిస్ట్ 2023లో జ్యువెలరీ ప్లేయర్స్ కల్యాణ్ జ్యువెలర్స్, జాయ్ అలుక్కాస్ వరుసగా 46వ, 47వ స్థానాల్లో నిలిచాయి. మరో రెండు ఆభరణాల తయారీదారులు, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్, తంగమయిల్ జ్యువెలరీ వరుసగా 78వ, 98వ స్థానంలో నిలిచాయి. ఫ్రెంచ్ లగ్జరీ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఈ ర్యాంకులో ఫస్ట్వచ్చింది. కోజికోడ్‌కు చెందిన మలబార్ గత ఏడాది ఆదాయం పరంగా 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువతో జాబితాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. టైటాన్ టర్నోవర్ 3.67 బిలియన్ డాలర్లకు చేరింది.
