- ఔషధ ప్రయోగాలంటూ ప్రజల ఆందోళన
భద్రాచలం, వెలుగు: 2030 సంవత్సరం నాటికి ఇండియాలో మలేరియాను నిర్మూలించాలనే లక్ష్యంతో ఐసీఎంఆర్(ఇండియన్సెంటర్ఫర్ మెడికల్ రీసెర్చ్), ఎన్ఐఎంఆర్(నేషనల్ ఇనిస్టిట్యూషన్ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సంయుక్తంగా భద్రాచలం మన్యంలో రీసెర్చ్ నిర్వహించాయి. ఈ నెల 9 నుంచి 18 వరకు ఉల్వనూరు, మంగపేట, అశ్వాపురం, మణుగూరు పీహెచ్సీల పరిధిలోని మలేరియా పీడిత గ్రామాల్లో రోగుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. 2005కు ముందు మలేరియా నివారణకు క్లోరోక్విన్, ప్రోమోక్విన్వాడేవారు. ఆ మందులకు మలేరియా తగ్గకపోవడంతో రీసెర్చ్ ద్వారా వాటిని మార్చేశారు. నాటి నుంచి నేటి వరకు ఏసీటీ (ఆర్టుసినేట్కాంబినేషన్థెరపీ) వినియోగిస్తున్నారు.
ఇపుడు దీని ప్రభావం తగ్గిందా.. ఇంకా ఏమైనా కొత్త ఔషధం ప్రవేశపెట్టాలా.. తెలుసుకునేందుకు ఈ రీసెర్చ్ ఒక పరిష్కారం చూపిస్తుంది. జిల్లాలో ఎక్కువగా మలేరియా కేసులు నమోదైన పీహెచ్సీలను ఎంపిక చేసి అక్కడ రీసెర్చ్ టీంలు 772 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఢిల్లీకి తీసుకెళ్లాయి. గ్రామాల్లో ఐసీఎంఆర్, ఎన్ఐఎంఆర్ టీంలు రీసెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ప్రైవేటు ఔషధ కంపెనీలు వారి మందులను ప్రయోగించడానికి సర్వే చేస్తున్నాయని అపోహలు వచ్చాయి. దీంతో గిరిజనులు బెంబేలెత్తిపోయారు. రీసెర్చ్ టీంలను నిలదీశారు. దీనిపై అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రీసెర్చ్పై ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు. రీసెర్చ్ఉద్దేశాన్ని కోయభాషలో స్థానిక గిరిజనులకు వివరించిన తర్వాతే బ్లడ్శాంపిల్స్సేకరించామన్నారు.ప్రస్తుతం జిల్లాలో మలేరియా చాలావరకు నియంత్రణలో ఉందన్నారు. 2020లో 604, 2021లో 351 కేసులు నమోదైతే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 205 మాత్రమే మలేరియా పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు.
