నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌ 500

నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌ 500

నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌ 500

కౌలాలంపూర్‌‌‌‌:  ఫామ్‌‌‌‌ కోల్పోయి కొంతకాలంగా నిరాశ పరుస్తున్న ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్ పీవీ సింధు మంగళవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ సూపర్‌‌‌‌ 500 టోర్నీతో తిరిగి గాడిలో పడాలని చూస్తోంది. గత వారం ఇదే వేదికపై జరిగిన మలేసియా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌ 700 టోర్నీలో సింధు, ప్రణయ్‌‌‌‌ క్వార్టర్​ఫైనల్లోనే వెనుదిరిగారు. ఈ టోర్నీలో రాణించి  కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తున్నారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో సింధు.. చైనాకు చెందిన బింగ్జియావోను ఎదుర్కోనుంది.29 ఏళ్ల ప్రణయ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి పోరులో ఇండోనేసియాకు చెందిన షెసర్‌‌‌‌ హిరెన్‌‌‌‌తో పోటీ పడనున్నాడు.  హైదరాబాదీలు సైనా నెహ్వాల్‌‌‌‌,  సాయి ప్రణీత్‌‌‌‌తో పాటు సమీర్‌‌‌‌ వర్మ, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.