జెన్ పాక్ట్ లో జాబ్.. బయట చైన్ స్నాచర్

జెన్ పాక్ట్ లో జాబ్.. బయట చైన్ స్నాచర్

జవహర్ నగర్ లో వరుస చైన్ స్నాచింగ్ లకు  పాల్పడుతున్న యువకుడిని మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత మూర్తి వివరాల ప్రకారం.. నిందితుడి దగ్గరి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, రెండు టూ వీలర్ వెహికిల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు జెన్ పాక్ట్ లో లో పనిచేసే సందీప్(22) చారిగా గుర్తించారు. చెడు అలవాట్లకు అలవాటు పడ్డ  సందీప్ ఈజీగా మనీ సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. నిందితుడిపై జవహర్ నగర్ లో ఆరు కేసులు ఉన్నట్లు చెప్పారు.