 
                                    జీడిమెట్ల, వెలుగు: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దామరచర్ల కృష్ణారావు కాలనీకి చెందిన పి.మల్లికార్జున(19) మైసమ్మగూడలోని సిరి డీలక్స్ హాస్టల్లో ఉంటూ మల్లారెడ్డి ఎంఆర్ఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పరీక్షలు ముగిశాక రాత్రి 10:30 గంటల వరకు స్నేహితులతో గడిపాడు. రాత్రి 11:45 గంటలకు అతడి రూమ్‌కి వెళ్లి పిలవగా స్పందన లేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకుని కన్పించాడు. మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.

 
         
                     
                     
                    