హైదరాబాద్ లో జాగలేదు.. ఇంకో ఎయిర్ పోర్టు పాలమూరులోనే: మల్లారెడ్డి

హైదరాబాద్ లో జాగలేదు.. ఇంకో ఎయిర్ పోర్టు పాలమూరులోనే: మల్లారెడ్డి

దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి మల్లారెడ్డి.  మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు వెళ్లి భారీగా పరిశ్రమలకు  పెట్టుబడులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. మహబూబ్ నగర్ ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి పూజ కార్యక్రమంలో కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు మల్లారెడ్డి. అమెరికా తర్వాత కార్పొరేట్ ఆఫీసులకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అని అన్నారు.  కేటీఆర్ వల్లే  రాష్ట్రానికి విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయన్నారు. కమాండ్ కంట్రోలర్ ఆఫీసు అమెరికా, ఇంగ్లండ్ , సింగపూర్ తర్వాత హైదరాబాద్ లో నిర్మించామన్నారు.  హైదరాబాద్ లో  ఎయిర్ పోర్టుకు జాగలేదని రెండో ఎయిర్ పోర్టు   పాలమూరులనే కట్టాల్సి వస్తదన్నారు.

9 ఏళ్ల క్రితం  పాలమూరులో నీళ్లు , కరెంటు, రోడ్లు  లేవనన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ , బీజేపీలు చేసిందేమీలేదని వారికి  ఓట్లడిగే హక్కు లేదన్నారు. తొమ్మిదేళ్లలోనే   కేసీఆర్  తెలంగాణను  సస్యశ్యామం చేశారన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు మల్లారెడ్డి