మోడీ మౌని బాబా: ఖర్గే కామెంట్...రాజ్యసభలో రచ్చ

మోడీ మౌని బాబా: ఖర్గే కామెంట్...రాజ్యసభలో రచ్చ

రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రధాని మోడీపై  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. అదానీ విషయంలో రచ్చ జరుగుతున్నా ప్రధాని పెదవి విప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రధాని పారిశ్రామికవేత్తల విషయంలో ఎందుకుండరని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టే నేతల పట్ల ప్రధాని మోడీ కటువుగా ఉంటే టికెట్‌ వస్తుందో రాదోనని భయపడుతారని, కానీ ప్రధాని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌని బాబాలా ఉంటున్నారని విమర్శించారు. 

ఖర్గే కామెంట్లపై రాజ్యసభ ఛైర్మన్ ధన్ కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హోదాకు అలాంటి పదాలు వాడటం సరికాదని సూచించారు. ప్రతిపక్ష నాయకుడి మాటలు సభలోని సభ్యులందరి మాటలను ప్రతిబింబించాలని చెప్పారు. దయచేసి సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు.