అబద్ధాన్ని నమ్మించేలా చెప్పడమే బీజేపీ ప్రత్యేకత: మల్లికార్జున ఖర్గే

అబద్ధాన్ని నమ్మించేలా చెప్పడమే బీజేపీ ప్రత్యేకత: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: అబద్ధాలను బీజేపీ బాగా నమ్మేలా చెబుతుందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలోని ప్రతి రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఇచ్చారని, 2023 పూర్తవుతున్నప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయారని తెలిపారు. ప్రతి భారతీయుడికీ ఇల్లు, 24 గంటల కరెంట్ తో పాటు ఇండియన్ ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చుతామని మోదీ వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఇవేవీ జరగలేదని ఖర్గే వివరించారు.  

అబద్ధాలే నిజమని నమ్మించేలా చెప్పడం బీజేపీ ప్రత్యేకత అని, ఆ విషయం  భారతీయులందరికీ తెలుసని ఖర్గే వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జన గణనను 2021లో నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోందని వివరించారు.