రేవంత్ పర్యటనను అడ్డుకోవడం కరెక్ట్ కాదు: మల్లికార్జున ఖర్గే

రేవంత్ పర్యటనను అడ్డుకోవడం కరెక్ట్ కాదు: మల్లికార్జున ఖర్గే
  • కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది:  మల్లికార్జున ఖర్గే


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అను మతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణ అనుమతులు ఇవ్వ డంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రవాస భారతీయులతో మమేకం కావడానికి ముఖ్యమంత్రులు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పర్యటిస్తుంటారని ఖర్గే తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు ఉన్నారని, వారు తమ సొంత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటే కేంద్రం కావాలనే అడ్డుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాలు నేరుగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడకుండా, అంతా కేంద్రం ద్వారానే జరగాలనే ఉద్దేశంతోనే ఈ అనుమతులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా పర్యటన అనుమతులు నిరాకరించడం పూర్తిగా అన్యాయమని, ఇది ప్రాథమికంగా తప్పు అని ఖర్గే పేర్కొన్నారు.