
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ రోజు ఉదయం కరోనాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా.. కరోనా పాటిజివ్‌గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.
For More News..