జర్నలిస్టులకూ రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్: మ‌మ‌తా బెన‌ర్జీ

జర్నలిస్టులకూ రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్: మ‌మ‌తా బెన‌ర్జీ

క‌రోనా మహమ్మారిపై పోరాడుతున్న వారికి రూ.10 లక్షల ఆరోగ్యబీమాను ప్రకటించారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.  కరోనా పోరాటంలో ప్రాణాలుకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లతో సహా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల బీమాను వర్తింపచేస్తామని  మమతా ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ జర్నలిస్టులకు కూడా వర్తిస్తుందని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రెస్‌ నాలుగో పిల్లర్‌ అని.. అందరూ ధైర్యంగా విధులు నిర్వర్తించాలని ఆమె హితవు పలికారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూ వార్తలను అందించే విషయంలో ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్న జర్నలిస్టుల  సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.

దీదీ నిర్ణయంపై బెంగాల్ వ్యాప్తంగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్న పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. కాగా, బెంగాల్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 922కు చేరుకుంది. వారిలో 33 మంది మృత్యువాత పడ్డారు.