
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. నందిగ్రామ్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన కేసును విచారిస్తున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని మమత ఆరోపించారు. ఈ మేరకు కౌషిక్ చందాను ఆ కేసును తప్పించి పిటిషన్‌ను మరొక జడ్జికి బదలాయించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం స్వయంగా కౌషిక్ చందానే విచారించారు. మమత పిటిషన్‌ను తోసిపుచ్చిన కౌషిక్ చందా.. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ మమతకు జరిమానా విధించారు. అదే సమయంలో ఆ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. జడ్జికి కళంకం తెచ్చే విధంగా సీఎం మమతా బెనర్జీ ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన విధులను ఆమె ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు.