అంతా స్క్రిప్ట్ ప్రకారమే..కరోనా పై రాజకీయం తగదు

అంతా స్క్రిప్ట్ ప్రకారమే..కరోనా పై రాజకీయం తగదు

ప్రధాని మోడీ లాక్ డౌన్ పై  అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ ప్రకారమే కరోనా ను అడ్డం పెట్టుకొని రాష్ట్రాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది.

కరోనా వైరస్ మరణాలపై కేంద్రం ఎప్పటికప్పుడు అన్నీ రాష్ట్రాల నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. ఆ డేటాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల పై తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపణలు వినిపించాయి. దీంతో కేంద్రం ప్రత్యేక బృందం బెంగాల్ లో పర్యటించింది. పర్యటనలో కరోనా పై దీదీ చేస్తున్న చర్యలు సరిగ్గా లేవని, ట్రాకింగ్, నిఘూ వ్యవస్థలో లోపం ఉందంటూ ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను కేంద్రానికి అందించారు.

అధికారుల పర్యటనపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అధికారులు తన అభిప్రాయం తీసుకోకుండా ఎలా నివేదికను తయారు చేస్తారని లేఖలో పేర్కొంది. ఆ లేఖ, అధికారుల పర్యటనపై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించినట్లు సమాచారం.