హెల్త్ పాలసీలపై GST తొలగించండి : సీఎం మమతా బెనర్జీ

హెల్త్ పాలసీలపై GST తొలగించండి :  సీఎం మమతా బెనర్జీ

జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు, ఇది ప్రజల కీలక అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

కాగా ఇటీవలే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, దీనికి పలువురు ప్రతిపక్ష నాయకులు మద్దతు ఇచ్చారు.

ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంల నుండి జిఎస్‌టిని వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. కనీస అవసరాలపై విధిస్తున్న ఈ జిఎస్‌టి ఆలోచన మంచిది కాదు. ఇది ప్రజల ప్రాథమిక అవసరాలను చూసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని బెనర్జీ  Xలో  పోస్ట్ చేశారు.