
కోల్ కతా: ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఆ రాష్ట్రంలోని మథువా కులానికి చెందిన ప్రజలకు తానేం చేయలేదని మోడీ అంటున్నారని దీదీ విమర్శించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని అందులో విఫలమైతే చెవులు పట్టుకొని గుంజీళ్లు తీస్తారా అంటూ మోడీకి ఛాలెంజ్ చేశారు. 'మథువా ప్రజలకు నేనేం చేయలేదని మోడీ నిరూపించగలరా? ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మోడీజీ అబద్ధాలు ఆడినట్లయి తేలితే ఆయన చెవులు పట్టుకొని గుంజీళ్లు తీయాలి. ఈ సవాల్ ను ఆయన పబ్లిక్ గా స్వీకరించాలి' అని మమత పేర్కొన్నారు.