
ఈ నెల 30 న జరిగే మోడీ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మమతా మీడియాతో చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందిందన్నారు. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించానని… దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి తాను హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు మమత.