అవునా నిజమా : కారులోనే టాయ్ లెట్ సీటు.. ఇదిగో వీడియో

అవునా నిజమా : కారులోనే టాయ్ లెట్ సీటు.. ఇదిగో వీడియో

కారు.. ఎక్కడికైనా వెళ్లాలంటే చక్కగా వెళ్లిపోవచ్చు.. ఎంత మంది అంటే.. నలుగురు, ఐదుగురు, ఏడుగురు ఇలా అనుకుంటాం.. అది పర్సనల్ అయినా క్యాబ్ అయినా కారు కారే.. అలాంటి కారులో టాయ్ లెట్ ఉంటే.. మరీ విడ్డూరంగా అనిపిస్తుందా.. కారులో టాయ్ లెట్ ఏంట్రా బాబూ.. అసలు ఎలా అరేంజ్ చేస్తారు.. అంత పెద్ద బస్సుల్లోనే లేదు.. ఏసీ బస్సుల్లోనూ లేదు.. అలాంటిది కారులో టాయ్ లెట్ ఎలా అరేంజ్ చేస్తారు.. అంత స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది.. అనే డౌట్స్ రావొచ్చు.. మీకు వచ్చే అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ.. ఓ వ్యక్తి తన కారులో ఇంట్లోని బాత్ రూంలో ఉండే విధంగా.. టాయ్ లెట్ సీటు అరేంజ్ చేసుకున్నాడు. ఆ విశేషాలేంటో పూర్తిగా చదవటంతోపాటు వీడియో చూద్దామా..

ఇండియాకు చెందిన దేశీమోజిటో అనే ఎక్స్ (ట్విట్టర్)లో ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అతను ఓ ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశాడు. ఆ కారులోని వెనక సీట్లలో ఒకటి తీసేశాడు. ఆ స్థానంలో చిన్న గుహలాంటి బాక్స్ అరేంజ్ చేశాడు. అందులో వెస్ట్రన్ టాయ్ లెట్ సీటు అరేంజ్ చేశాడు. ఆ పక్కన ఫ్లష్ ఏర్పాటు చేశాడు. అందులో నీళ్లు నింపుకుంటాడు. అందులోనే ఆరు అడుగుల వ్యక్తి సైతం ఎంచక్కా కూర్చోవటానికి అనుగుణంగా తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అంత పెద్ద ఫార్చ్యునర్ లగ్జరీ కారును టాయ్ లెట్ గా మార్చటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు అయితే కారు కంపు కొడుతుంది కదా.. టాయ్ లెట్ పక్కన కూర్చుని ఎలా డ్రైవ్ చేయగలం అని అంటున్నారు. మరికొందరు అయితే వెనక సీట్లో కూర్చునే వ్యక్తికి అది టాయ్ లెట్ అని తెలిస్తే పరిస్థితి ఏంటీ అనే డౌట్ వస్తే.. మరో నెటిజన్ అయితే.. కారులో డ్రైవ్ చేస్తూ ఏమైనా తినాలి అనుకుంటే టాయ్ లెట్ గుర్తుకొచ్చి వాంతులు అవ్వటం ఖాయం అంటున్నారు. ఏదిఏమైనా టాయ్ లెట్ తో జర్నీ అంటే మహా కష్టం.. రోత.. యాక్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఓవరాల్ గా ఓ విషయంలో అభినందించాల్సిందే.. లగ్జరీ కారులో టాయ్ లెట్ ఏర్పాటు చేసుకోవచ్చు అని.. అతనికి అలాంటి ఆలోచన రావటమే కాకుండా.. తన ఐడియాను నిరూపించి చూపించాడు.. ఐడియా సెక్సెస్ అయ్యిందా లేదా అనేకంటే..ఆలోచన రావటమే గొప్ప.. దాన్ని చేసి చూపించటం మరో అద్భుతం అంటున్నారు నెటిజన్లు..