
బెల్లంపల్లి, వెలుగు: పెళ్లి చేసుకుంటానని బాలికను మోసం చేయడమే కాకుండా అబార్షన్చేయించేందుకు యత్నించిన ముగ్గురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నీల్వాయి ఎస్సీ కాలనీకి చెందిన బాలిక సెకండ్ఇయర్ చదువుతోంది. కరోనా లాక్డౌన్కారణంగా ఇంటి దగ్గరే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఇంటి పక్కన ఉన్న చెన్నూరి ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వెంట పడుతూ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించేందుకు చెన్నూర్ఆస్పత్రికి తీసుకెళ్తానని ఒత్తిడి తెచ్చాడు. బాలిక రాననడంతో ఇంటి వద్దే అబార్షన్‌కు స్కెచ్ వేశాడు. మాట్లాడాలని ఇంటికి పిలిపించి తన సోదరులు సంతోష్, ప్రశాంత్‌లతో కలిసి బలవంతంగా మాత్రలు మింగించాడు. అనారోగ్యానికి గురైన బాలిక విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. తండ్రితో కలిసి బాలిక నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నూరి ప్రసాద్, సంతోష్, ప్రశాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేందర్చెప్పారు.