హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక వ్యక్తి దారుణ హత్య

V6 Velugu Posted on Apr 12, 2021

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని శివ గా గుర్తించారు. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. 40 ఏళ్ళ శివ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉండటానికి ఇళ్లు లేకపోవడంతో ఫుట్ పాత్ పైనే జీవిస్తున్నాడు. నిన్న రాత్రి నెంబర్ 10బీలో ఫుట్ పాత్ పైనే మరో ముగ్గురు తోటి కూలీలు డేవిడ్, రాకేశ్, శ్రీనివాస్ లతో కలిసి మందు తాగాడు. ఆ తర్వాత  రాకేశ్, శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. శివ, డేవిడ్ మాత్రం అక్కడే ఉండిపోయారు.

తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో శ్రీనివాస్ అక్కడకు వచ్చి చూడగా... శివ తల పగిలి, రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి  తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. హత్యలో అనుమానితుడిగా భావిస్తున్న డేవిడ్ కోసం గాలింపు చేపట్టారు.

Tagged Hyderabad, Man, Jubilee Hills, brutally murdered

Latest Videos

Subscribe Now

More News