నగర శివారులో మర్మాంగాలు కోసి కిరాతంగా హత్య

V6 Velugu Posted on Jul 26, 2021

హైదరాబాద్: పటాన్ చేరు మండలం చిట్కుల్ గ్రామంలోని వడ్డెర కాలని శివార్లలో  ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు . గుర్తుతెలియని దుండగులు మర్మావయవాలను కోసి  హతమార్చారు. సంగారెడ్డి జిల్లా వడ్డెర కాలని శివారులోని నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతుడు సుంకర యాదగిరి (30) గా గుర్తించారు. ఇతడ్ని దుండుగులు సిమెంట్ ఇటుక రాళ్లతో తలపై మోది మర్మాంగాలను కోసి కిరాతకంగా హత్య చేశారు. ఉదయమే సమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై తలపై సిమెంట్ ఇటుక రాళ్లతో మోది, మర్మావయాల ను  కోసిన ఆనవాళ్లును పోలీసులు కనుగొన్నారు. పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి,  సీఐ వేణుగోపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించి కారణాలపై ఆరా తీశారు. మృతుడు గతంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితుడని,  హత్యకు సంబంధించిన కారణాలను అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

Tagged sangareddy district, Patancheru PS Limits, Chitkulu village, Man murder at vaddera colony, cuts private parts of body, brutally murder at Patancheru

Latest Videos

Subscribe Now

More News