ఇంటికి పిలిచి ప్రియుడి దారుణ హత్య ..భర్తతో కలిసి చంపిన భార్య

ఇంటికి పిలిచి ప్రియుడి దారుణ హత్య ..భర్తతో కలిసి చంపిన భార్య
  • అప్పు తిరిగివ్వాలని అడిగితే చంపేశారు: మృతుడి తండ్రి

సంభాల్(యూపీ): ప్రియుడిని ఇంటికి పిలిచి తన భర్తతో కలిసి దారుణంగా హత్య చేసిందో మహిళ. ఇంట్లోని స్ర్కూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ తో భార్యాభర్తలు ఇద్దరూ దాడిచేసి చంపేశారు. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. మృతుడిని అనీష్​గా పోలీసులు గుర్తించారు. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకే తన కొడుకును చంపేశారని అనీష్​ తండ్రి ముస్తాకిమ్  ఆరోపించాడు. ‘‘పొరుగింటి వ్యక్తి రయీస్ కు నా కొడుకు కొన్నేండ్ల క్రితం రూ.7 లక్షలు అప్పుగా ఇచ్చాడు.

ఇటీవల మా అబ్బాయికి పెండ్లి ఫిక్సయింది. పెండ్లి ఖర్చుల కోసం అప్పు వసూలు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పు చెల్లించాలని రయీస్ ను అడిగాడు. దీంతో రయీస్  తన భార్య సితారతో కలిసి మా అబ్బాయిని అతిదారుణంగా చంపేశాడు. అప్పు చెల్లిస్తానని పిలవడంతో అనీష్  వాళ్ల ఇంటికి వెళ్లగా.. భార్యాభర్తలిద్దరూ కలిసి అనీష్​ కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. స్క్రూడ్రైవర్​తో పొడుస్తూ, కటింగ్ ప్లేయర్​తో కొట్టారు” అని ముస్తాకిమ్  కన్నీటిపర్యంతమయ్యాడు.

అయితే, అనీష్​ హత్యకు వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. రయీస్  భార్య సితార, అనీష్ ల మధ్య అక్రమ సంబంధం ఉందని వారు వెల్లడించారు. అయితే, ప్రియుడు అనీష్​ ను హత్య చేసేందుకు సితార ఎందుకు కుట్రపన్నిందనేది తెలియరాలేదని పోలీసులు చెప్పారు.