
- ఢిల్లీ అసెంబ్లీ స్టేషన్‌లో ఘటన
ఢిల్లీ మెట్రో రైల్ స్టేషన్‌లో దారుణం జరిగింది. ఓ 40 ఏళ్ల వ్యక్తి ట్రైన్ దగ్గరకు రాగానే పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. అయితే ఆత్మహత్యకు పాల్పడిన ఆ వ్యక్తి ఎవరు? కారణమేంటి అన్న విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మెట్రో యల్లో లైన్ ట్రాక్‌పై ఉంటుంది ఢిల్లీ అసెంబ్లీ మెట్రో స్టేషన్. ఎప్పుడు బిజీగా ఉండే వాయవ్య ఢిల్లీలోని సమయాపుర్ బద్లీ – గురుగ్రామ్‌లోని హుడా సిటీ సెంటర్ స్టేషన్ల రూట్ ఇది. ఈ రూట్‌లోని స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో మృతదేహం తీయడం, ఇతర ఫార్మాలిటీస్ వల్ల కొంత సేపు టైన్లు ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ట్రైన్లు ఆలస్యంగా నడుస్తాయని ఢిల్లీ మెట్రో సంస్థ ట్వీట్ చేసింది. ఆ తర్వాత అంతా సెట్ అయిన విషయాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Yellow Line Update
Normal services have resumed. https://t.co/6cQRvk8t95
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 6, 2019