
షాకింగ్ ఇన్సిడెంట్..గమ్యం చేరుకోవాలన్న ఆతృత.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాగైనే అవతలి ఫ్లాట్ ఫారమ్ మీదకు వెళ్లి రైలును క్యాచ్ చేయాలన్న అతడి తొందరపాటు అత్యంత భయానక పరిస్థితుల్లోకి నెట్టింది. ఇలా చేస్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం అతడి ప్రాణానికే ముప్పు తెచ్చింది. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి ఫ్లాట్ ఫారమ్కు రైలు మధ్య నలిగి నరకయాతన అనుభవిస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది..
మంగళవారం ( నవంబర్ 25) ఢిల్లీలోని ఛతర్ పూర్ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకంది. ఉత్తరప్రదేశ్కు చెందిన భూరాసింగ్ (40) రైలు క్యాచ్ చేయాలని ఆతృతతో రైలు పట్టాలు దాటుతూ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఢిల్లీ మెట్రోరైలు ఎక్కి ఛతర్ పూర్ మెట్రో స్టేషన్లో దిగాడు. ఒకటో నెంబర్ ప్లాట్ పారమ్పై దిగిన భూరాసింగ్..రెండో ఫ్లాట్ ఫారమ్ చేరుకునే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. రెండో ప్లాట్ ఫారమ్ చేరుకునేందుకు మెట్లుగానీ, లిఫ్ట్ గానీ ఉపయోగించలేదు భూరా సింగ్. నేరుగా రైలు వచ్చే సమయానికి రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ట్రాక్ దాటుతుండగా తనవైపు రైలు రావడంతో తప్పించుకోడానికి ప్రయత్నించినా ఫలితంలేదు..ఓ మహిళ కూడా భూరాసింగ్ ను ఫ్లాట్ ఫారం పైకి లాగేందుకు ప్రయత్నించింది. అయినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది..
భూరాసింగ్ రైలుకు, ఫ్లాట్ ఫారానికి మధ్య నలిగి పోయాడు. రైలు కొన్ని మీటర్ల దూరం అతడిని ఈడ్చుకెళ్లింది. భూరాసింగ్ బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయింది. రైలు, ఫ్లాట్ ఫారమ్ మధ్య బాడీ నలిగిపోయి అక్కడే ప్రాణాలు విడిచాడు.
గమ్యం చేరాలనే ఆతృతతో రైల్వే నియమాలు పాటించడంలో కొందరు నిర్లక్ష్యం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. గమ్యం చేరుకునేందుకు కొన్ని నిమిషాలు ఆదా చేసేందుకు మీ ప్రాణాలు పణంగా పెట్టండం మంచిదికాదంటున్నారు. ఇలాంటి చర్యలు అరికట్టేందుకు స్టేషన్లలో భద్రత పెంచాలని కోరుతున్నారు. సత్వరమే నిఘా ఏర్పాటు చేయాలంటున్నారు.
बीते शनिवार को 40 वर्षीय एक व्यक्ति की कुचलकर मौत हो गई मृतक की पहचान भूरा सिंह के रूप में हुई है, जो उत्तर प्रदेश के कानपुर जिले के एक गांव का मूल निवासी था बताया जा रहा है
— Lavely Bakshi (@lavelybakshi) November 28, 2023
मृतक दिल्ली से मेट्रो में चढ़ा और छतरपुर मेट्रो स्टेशन के प्लेटफॉर्म नंबर 1 पर उतर गया। स्टेशन से तेजी से… pic.twitter.com/4jVp7dyR0y
Also Read :-నాడి పట్టేసింది : గూగుల్ నుంచి డాట్ మిమీ డొమైన్స్