అనుమానంతో ప్రియురాలి గొంతు కోసిండు

అనుమానంతో ప్రియురాలి గొంతు కోసిండు
  • మహిళపై కత్తితో దాడి, పరిస్థితి విషమం
  • పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్‌:  అనుమానంతో ప్రియురాలి గొంతును కోసాడు ఓ యువకుడు. పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32) తన భర్తతో విడాకులు తీసుకుని తన తల్లితో కలిసి ఉంటోంది. ఈక్రమంలో తన ఫ్రెండ్​ గౌలిపురకు చెందిన మణికంఠతో పరిచయం పెరిగి ప్రేమించుకుంటున్నారు. అయితే  కొన్ని రోజులుగా మణికంఠతో ఆమె దూరంగా ఉంటోంది.  ప్రియురాలు మరొకరితోను ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానంతో ఇవాళ ఉదయం శ్రావ్య ఇంటికి మణికంఠ వెళ్లాడు. శ్రావ్య తల్లి  జాబ్‌కి వెళ్లింది.

శ్రావ్య కూడా అప్పుడే జిమ్‌కు వెళ్లి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించి మణికంఠ ఇంట్లోకి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో గొంతు కోసి ముఖంపై దాడి చేశాడు.  తీవ్ర గాయాలైన శ్రావ్యను చికిత్స కోసం ఉస్మానియా  ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది.  దాడికి పాల్పడ్డ మణికంఠను చత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.