
భర్త వేధించాడని కొందరు.. చిత్రహింసలు పెట్టారని మరికొందరు.. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించారని విడాకులు తీసుకున్న ఘటనలను చాలా చూశాం. ఈ మధ్య కూర సరిగా వండడం లేదని..భర్త సర్ ప్రైజ్ లు ఇవ్వలేదనే సాకులతో విడాకులు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ మహిళ పెళ్లయిన 40 రోజులకే ఓ వింత కారణంతో తన భర్త నుంచి విడాకులు కోరింది. తన భర్త అసలు స్నానమే చేయడం లేదని...ఆ దుర్వాసనను భరించలేనని..అతనితో జీవించడం కష్టం విడాకులు కావాలని కోర్టుకెక్కింది.
నా భర్త( రాజేష్) నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తాడు. అతడి నుంచి వచ్చే దుర్వాసన నేను భరించలేకపోతున్నా.. అతనితో జీవించలేకపోతున్నా అని కేసు పెట్టి.. కౌన్సిలింగ్ కేంద్రాన్ని సంప్రదించింది. అయితే ఈ వింత ఘటనతో షాకైన్ అధికారులు ఆమె భర్త రాజేష్ ను పిలిచి అడిగారు. అయితే రోజు స్నానం చేయనని అంగీకరించాడు.
ALSO READ | మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి
రాజేష్ స్నానానికి బదులుగా ప్రతి వారానికి ఓసారి గంగానది నుంచి గంగాజల్ ను తనపై చల్లుకుంటాడు. కానీ పెళ్లయినప్పటి నుంచి 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడు అది కూడా భార్యపట్టుబట్టడంతో. కొన్ని రోజుల క్రితం మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టి..విడాకులు కావాలని కోరింది. తన భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. అయితే అతను డైలీ స్నానం చేస్తానని..పరిశుభ్రంగా ఉండేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో వీళ్లిద్దరు మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.
ఇలాంటి విచిత్రమైన కేసు ఈ ఏడాదిలో ఒకటి ఆగ్రాలో వచ్చింది. ఓ మహిళ తన భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరింది. రోజుకు కనీసం ఐదు కుర్ కురే ప్యాకేట్లు ఇవ్వాలని డిమాండ్ చేసేది. ఒక రోజు స్నాక్స్ తీసుకురావడం మర్చిపోవడంతో అతడి భార్య విడాకులు కావాలని కోరింది.