వీడియో: ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఐఫోన్.. అయినా దొరికింది

వీడియో: ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఐఫోన్.. అయినా దొరికింది

మామూలుగా ఫోన్ చేతిలో నుంచి కిందపడితేనే పనిచేయదు. అటువంటిది ఏకంగా విమానం నుంచి కిందపడితే.. ఇక అంతే సంగతులు. కానీ.. ఇక్కడ ఊహించనిది జరిగింది. విమానం నుంచి 300 అడుగుల ఎత్తునుంచి కిందపడ్డా ఆ ఫోన్ చెక్కుచెదరలేదు. కేవలం స్క్రీన్ ప్రొటెక్టర్ మరియు ఫోన్ కవర్‌ మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయి.

బ్రెజిలియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎర్నెస్టో గలియోట్టో రియో ​​డి జనీరోలోని కాబో ఫ్రియోలోని ఒక బీచ్ మీదుగా సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తూ ఫోటో షూట్ చేస్తున్నాడు. ఆయన కెమెరాలతోనే కాకుండా.. తన ఐఫోన్‌ 6ఎస్‌తో కూడా వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఇంతలో అనుకోకుండా చేతిలో నుంచి జారిన ఐఫోన్.. అమాంతం కిందపడింది. దాంతో ఎర్నెస్టో ఇక తన ఫోన్ పోయినట్లేనని భావించాడు. కానీ.. ఎందుకైనా సరే ఒకసారి ట్రై చేసి చూద్దామని.. ఫోన్ జీపీఎస్ ట్రాక్‌ను ట్రేస్ చేశాడు. అప్పుడు ఫోన్ బీచ్ దగ్గర ఒడ్డున పడినట్లు తెలుసుకున్నాడు. వెంటనే జీపీఎస్ సాయంతో ఫోన్ లోకేషన్‌కి వెళ్లాడు. అక్కడ ఫోన్ ఏమాత్రం పాడవకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మరో విచిత్రమేమంటే.. ఆ ఫోన్ విమానం నుంచి కింద పడేంత వరకు మొత్తం వీడియోను రికార్డ్ చేసింది. విమానం ఎత్తు 300 మీటర్ల నుంచి ఫోన్ భూమిన చేరడానికి 15 సెకన్లు పట్టినట్లు ఆ వీడియో ద్వారా తెలిసింది.

‘ఫోన్ కింద పడిన తర్వాత దాదాపు గంటన్నర సేపు వీడియో రికార్డయింది. మేం ఫోన్‌ను వెతికి చూసేసరికి ఫోన్‌లో 16% చార్జింగ్ ఉంది. సూర్మరశ్మి ద్వారా ఫోన్ కొంత చార్జింగ్ అయినట్లు భావిస్తున్నాం’ అని ఎర్నెస్టో తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను.. ఎర్నెస్టో తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

For More News..

స్మగ్లర్ల మహాతెలివి.. బస్సులో వైట్ డ్రెస్.. తిరుమలలో కాషాయం.. అడవిలో టీషర్ట్

ఓయూ విద్యార్థిపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల దాడి

విడాకులకు దేశమంతా ఒకే రూల్స్ ఉండాలె

ఈ ఊళ్లె అమ్మాయి పుడితే.. పండుగ చేస్తరు