
నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే.? బంగళ్ పేట కాలనీలో ఉండే ఇద్దరు అన్నదమ్ములు పప్పు తాళింపుపై తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన అన్న నరేష్ స్థానిక చెరువులో దూకాడు. అన్నను కాపాడేందుకు వెళ్లి తమ్ముడు నవీన్ కూడా చెరువులో దూకాడు. దీంతో ఇద్దరు గల్లంతయ్యారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఈతగాళ్లు గల్లంతైన అన్నదమ్ములను బయటకు వెలికి తీశారు. అన్నదమ్ములు ఇద్దరు చనిపోవంతో కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు.
అన్మదమ్ములిద్దరిని దత్తత తీసుకోని పెంచిన పెద్దనాన్న రోదిస్తున్నాడు. ఇద్దరు కోడుకులు ప్రాణాలు కోల్పోవడంతో విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిర్మల్ టౌన్ పోలీసులు.