బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్‌లో దొరికాడు

బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్‌లో దొరికాడు

ఇండియాలో అనకొండ జాతి పాములు లేవని అనుకొన్నాడేమో బ్యాంకాక్ వెళ్లిన ఓ వ్యక్తి.  అక్కడి నుంచి తిరిగి వస్తున్న అతను 10 ఎల్లో అనకొండల్ని తన లగేజ్ బ్యాగ్ భద్రంగా ప్యాక్ చేసుకొని తీసుకువస్తున్నాడు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టలోని కస్టమ్స్ అధికారులు చెక్  ఇన్ లగేజ్ బ్యాగ్ లో చూడగా షాక్ అయ్యారు. అరుదైన పది ఎల్లో అనకొండ పాము పిల్లల్ని బ్యాంకాక్ నుంచి బ్యాగ్ లో తీసుకువస్తున్నాడు. 

భారత్ లోని వన్య ప్రాణుల అక్రమ రవాణ చట్టం కింద అతన్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఓ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారి ఎక్స్ లో పంచుకున్నాడు. బెంగళూర్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ ఆఫీసర్స్ అక్రమ రవాణా నుంచి ఇప్పటి వరకు 234 వన్య ప్రాణులను రక్షించారు.