
దేశ సరిహద్దులు దాటి యూరప్‌లోకి చేరాలన్న ఓ వ్యక్తి ఆరాటానికి ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. కార్లో డాష్‌బోర్డుకు చిన్నచిన్న వస్తువులు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా. ఆ బాక్సులోకి దూరేసి బోర్డర్ దాటే ప్రయత్నం చేశారు ఆఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు. మే 24న మొరాకో, మెలిలా మధ్య బెని–ఎంజర్ సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు వాళ్లు డాష్‌బోర్డులో దూరి ప్రయాణం చేస్తున్నట్టు గుర్తించారు. వారిని పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు పరుపుల్లో దూరి కూడా దేశం దాటాలని చూశారు. ఉత్తర ఆఫ్రికా, మెలిలా, క్యూటాకు చెందిన వేలాది మంది మెరుగైన జీవితం కోసం స్పెయిన్‌లోకి అక్రమంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.