
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో ఇద్దరి మధ్య మొదలైన భూ తగాదా ఒకరి హత్యకు కారణమైంది. ఈ గొడవలో పెట్టేం శంకరయ్య అనే వ్యక్తిపై అల్లంల బాలయ్య గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.