
ఆంధ్ర ప్రదేశ్ శ్రీశైలం ఆనకట్ట దిగువన క్రిష్ణానది బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం బ్రడ్జిపై రక్తపు మరకలు కనపడడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జి పరిసరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఒక మగ వ్యక్తిని హత్యచేశారని నిర్ధారనకు వచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో చెప్పులు, సిగరెట్లు, లైటర్, పెన్నును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఘటనా స్థలాన్ని అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. వ్యక్తిని చంపి నదిలో పడేశారని రెండురోజుల్లో మృతదేహం బయటకు తేలవచ్చని, ఆ తర్వాతే దర్యాప్తు చేస్తామని చెప్పారు పోలీసులు.ఘటనా స్థలంలో సీసీకెమెరాలు లేకపోవడంతో హత్యను ఎవరుచేశారని తెలుసుకొవడం కష్టమవుతుందని అన్నారు. బ్రిడ్జి దగ్గరలోని స్థానికకుటుంబాలు, వ్యాపారులు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ముందుకు రావాలని డీఎస్పీ సూచించారు.